Site icon Bhakthi TV

చండీ దేవి ఆలయాలు ఎక్కడున్నాయి?

చండీ అవతారాన్ని అమ్మవారు ఎందుకు ధరించాల్సి వచ్చిందో తెలుసుకున్నాం కదా. శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు ఈ అవతారాన్ని ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. చండీ యాగం చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ యాగాన్ని చేయించుకోలేని వారు కనీసం ఈ యాగాన్ని చూసినా.. హోమగుండానికి నమస్కరించినా, హోమ విభూతిని ధరించినా ఫలితం చాలా బాగుంటుందట. ఇక ఇప్పుడు చండీ దేవి ఆలయాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

చండీదేవి, ఆమె తేజోరూపమైన చాముండీదేవి రూపంలో వెలిసింది. అమ్మవారి ఆలయాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటిల్లో హరిద్వార్ ఒకటి. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లు చెబుతారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. మైసూరు పాలకులు చాముండి ఆలయాన్ని నిర్మించారు. దీనిని అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా పేర్కొంటారు. ఇవి కాకుండా మరెన్నో క్షేత్రాల్లోనూ.. కొన్ని గ్రామాల్లో గ్రామదేవతగానూ, కులదేవతగా కూడా చండీదేవిని కొలుస్తారు. సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా, తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.

Share this post with your friends
Exit mobile version