
శ్రీ మహా విష్ణువుకు ఎన్నో దివ్యనామాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన విశిష్టతను, శక్తిని కలిగి ఉంటాయి. శ్రీ మహా విష్ణువు వెయ్యి దివ్యనామాల సంకలనమే విష్ణు సహస్రనామంగా కీర్తించబడుతోంది. అలా వెయ్యి దివ్యనామాలను చెప్పలేని వారు అత్యంత ముఖ్యమైన 16 దివ్యనామాలను చెప్పి పూజించడం ద్వారా కూడా శ్రీ మహా విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ 16 దివ్యనామాలకు విష్ణు షోడశ నామం లేదా షోడశ నామ స్తోత్రం అని పేరు. ఈ 16 దివ్యనామాలను, వాటి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి చెప్పగలమా అని అడిగితే నేటి హడావుడి జీవితంలో చెప్పలేం. కానీ ఈ ప్రతి దివ్యనామాన్ని, మన దైనందిన జీవితంలో ప్రతి పనిని చేసేటప్పుడు చెప్పడం వల్ల పెరుమాళ్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు.
విష్ణు షోడశ నామ స్తోత్రం :
మందు తీసుకునే ముందు – విష్ణు
భోజనం చేసేటప్పుడు – జనార్దనా
నిద్రపోయే ముందు – పద్మనాభా
వివాహం చేసుకునేటప్పుడు – ప్రజాపతి
యుద్ధ భూమిలో ఉన్నప్పుడు – చక్రధరా
ప్రయాణం చేసేటప్పుడు – త్రివిక్రమామరణ
శయ్యపై ఉన్నప్పుడు – నారాయణా
ప్రియమైన వారిని కలిసేటప్పుడు – శ్రీధరా
చెడు కలలు వెంటాడుతున్నప్పుడు – గోవిందా
ఆపద లేదా కష్టం వచ్చినప్పుడు – మధుసూదనా
అడవిలో ఉన్నప్పుడు – నరసింహా
నిప్పుల్లో చిక్కుకున్నప్పుడు – జలశయనా
నీటిలో చిక్కుకున్నప్పుడు – వరాహా
పర్వతాన్ని ఎక్కేటప్పుడు – రఘునందనా
బయటకు బయలుదేరేటప్పుడు – వామనా
ఏ పని చేసేటప్పుడైనా – మాధవా…. అని ఈ నామాలను పలికితే విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన ఫలితం దక్కుతుందంటారు ఆధ్యాత్మిక పండితులు.
