Site icon Bhakthi TV

నృసింహ జయంతి ఎప్పుడు? పూజ ఎలా చేయాలి?

వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని నృసింహ జయంతిగా జరుపుకుంటాం. ఇది హిందువులకు అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి. మరి ఈ ప్రత్యేక దినాన్ని మనం ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోనున్నామో ముందుగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం మే 10వ తేదీన నృసింహ జయంతిని మనమంతా జరుపుకోనున్నాం. కాబట్టి ఈ రోజున నృసింహ స్వామిని కొన్ని ప్రత్యేక విధి విధానాలతో పూజిస్తే ద్వారా శత్రు బాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడటంతో పాటు అన్నింటా మనకు విజయం, అనారోగ్య సమస్యలకు తొలగిపోవడం వంటివి జరుగుతాయట.

నృసింహ జయంతి రోజున స్వామివారిని ఎలా పూజించుకోవాలో తెలుసుకుందాం. ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఇంట్లోని పూజా మందిరంలో పీట పెట్టి దానిపై బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి ఎరుపు రంగు వస్త్రాన్ని దానిపై పరచాలి. ఆ తరువాత నరసింహ స్వామి చిత్రపటాన్ని పెట్టి గంధం, కుంకుమతో అలంకరించాలి. అనంతరం వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి తొమ్మిది వత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి. తొమ్మిది వత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి. అనంతరం ఎర్ర గులాబి పూలతో పూజ చేయాలి.

Share this post with your friends
Exit mobile version