Site icon Bhakthi TV

ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడంటే..

చంద్రగ్రహణం ముగిసింది. ఇక ఇప్పుడు సూర్యగ్రహణం వంతు. ఇది కూడా ఈ నెలలోనే సంభవించనుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం కావడం విశేషం. మరి అదెప్పుడు సంభవిస్తుందో చూద్దాం. సూర్యగ్రహణం పితృపక్షంలో చివరి రోజు అంటే భాద్రపద మాసం అమావాస్య నాడు ఏర్పడనుంది. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ప్రారంభం కానుంది. అయితే ఈ సూర్యగ్రహణం కూడా గత సూర్యగ్రహణం మాదిరిగానే భారతదేశంలో కనిపించదు.

న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025న రాత్రి 11:00 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం సమయంలో కొన్ని రాశుల స్థానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కన్యారాశిలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఆ సమయంలో రాహువు వచ్చేసి కుంభరాశిలోనూ.. కుజుడు వచ్చేసి తులారాశిలోనూ ఉంటాడు. బృహస్పతి మకరరాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు.

Share this post with your friends
Exit mobile version