Site icon Bhakthi TV

కైలాస మానస సరోవర యాత్ర ఎప్పుడు? ఎలాంటి నియమాలు పాటించాలి?

ప్రతి హిందువూ తన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో మానస సరోవర యాత్ర చేయాలని అంతా భావిస్తారు. అందుకే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. హిందువులంతా ఈ యాత్రను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యాత్ర నిర్వహించి కైలాసనాథుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. పైగా అన్ని కోరికలు తీరుతాయి. ఈ తీర్థయాత్రకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించబడ్డాయి. వీటిని పాటించడం అవసరం. దీనికి ముందుగా కైలాస మానస సరోవర యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం.

దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ యాత్రకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కైలాస మానసరోవర యాత్ర జూన్ 30, 2025 నుంచి ప్రారంభం కానుంది. కైలాస మానసరోవర యాత్ర ఆగస్టు 2025 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో భక్తులు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం..

ప్రయాణంలో శుభ్రత, స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కైలాస యాత్ర సమయంలో ఎవరిపై కోపం తెచ్చుకోకుండా మనస్సును భగవంతునిపై నిమగ్నం చేసి ప్రశాంతంగా ఉంచుకోవాలి.
శివుని స్తుతులు జపిస్తూ ప్రయాణం సాగించాలి.
ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారమే తీసనుకోవాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే యాత్ర చేయాలి.
ఈ యాత్రలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే పాల్గొనగలరు.

Share this post with your friends
Exit mobile version