Site icon Bhakthi TV

మార్గశిర పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజున ఏ రాశివారు వేటిని దానం చేయాలి?

హిందూమతంలో మార్గశిర మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో చాలా ముఖ్య దినాలు ఉన్నాయి. వాటిలో మార్గశిర పౌర్ణమి ఒకటి. మనం మార్గశిర పౌర్ణమిని ఈ నెల 15వ తేదీన జరుపుకోబోతున్నాం. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తే చాలా మంచిదని చెబుతారు. గంగా స్నానం, మార్గశిర పౌర్ణమి రోజున చేసే దానాలకు కూడా చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేసిన వారి ఇంట ఆహారం, డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఎటువంటి దానం చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి వారు మార్గశిర పౌర్ణమి రోజున గోధుమలు, బెల్లం దానం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు బియ్యం, పంచదార దానం చేయాలి. మిథున రాశి వారు కూరగాయలను.. కర్కాటక రాశి వారు పాలు, పెరుగు.. సింహరాశి వారు వేరుశెనగ, తేనె దానం చేయాలి. కన్యా రాశి వారికి మొక్కజొన్న, చెరకు.. తులారాశి వారు తెల్లని వస్త్రాలను దానం చేయాలి. వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులను.. ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు దానం చేయడం శుభప్రదం. కుంభ రాశి వారు ఈ రోజున నీలిరంగు వస్త్రాలు, నల్ల నువ్వులు.. మీన రాశి వారికి పండిన అరటిపండ్లు, బొప్పాయి దానం చేయడం శుభప్రదం. ఇలా రాశిని బట్టి సూచించిన విధంగా దానం చేస్తే వారికి జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటారని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version