Site icon Bhakthi TV

జ్యేష్టమాసం పౌర్ణమి తిథి ఎప్పుడు?

హిందూ మతంలో ప్రతి తిథికి ఏదో ఒక ప్రాధాన్యత అయితే తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథికి మనం అత్యంత ప్రాధాన్యతను ఇస్తాం. ఈ రోజున ఆలయాల్లో అయితే స్వామివార్లకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఇక చాలా మంది ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొనడంతో పాటు శాంతి, అన్ని దు:ఖ బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు. ముఖ్యంగా జేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితంలో చంద్ర దోషం తొలగి.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట.

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. మరి ఈ ఏడాది జేష్ట్య పౌర్ణమి ఎప్పుడు? అంటే.. జ్యేష్ట పౌర్ణమి తిథి.. ఈ సంవత్సరం జూన్ 10, 2025 మంగళవారం ఉదయం 11:35 గంటలకు ప్రారంభం కానుంది. జూన్ 11 బుధవారం మధ్యాహ్నం 1:13 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ ఏడాది జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం, 11, 2025న జరుపుకోనున్నాం. ఈ రోజున చంద్రుడిని సైతం పూజిస్తారు. ముఖ్యంగా జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు చంద్రుడిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందట.

Share this post with your friends
Exit mobile version