Site icon Bhakthi TV

మాస శివరాత్రి ఎప్పుడు? ప్రతి రాత్రి శివరాత్రి ఎలా అవుతుందంటే..

హిందువులకు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. అలా మాస శివరాత్రికి సైతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మహా శివరాత్రి అయితే ఏడాదికి ఒకసారి వస్తుంది కానీ మాస శివరాత్రి మాత్రం నెలకొకసారి వస్తుంటుంది. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అంటే లింగోద్భవం అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. అసలు మాస శివరాత్రి ఈ మాసంలో ఏ తేదీన రానుంది? మాస శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

మాస శివరాత్రి ఎప్పుడు? ప్రతి రాత్రి శివరాత్రి ఎలా అవుతుందంటే..

ప్రతిరోజు రాత్రి శివుడిని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని చెబుతారు. అలా పరమేశ్వరుడిని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది. మాస శివరాత్రి ఇవాళే (ఏప్రిల్ 15). ఈ రోజున వైశాఖ మాస కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version