Site icon Bhakthi TV

శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది ఎప్పుడు?

హిందూమతంలో చాలా ప్రత్యేక పండుగలు ఉన్నాయి. శ్రీ మహా విష్ణువు లోక కల్యాణార్థం దశావతారాలు ఎత్తిన విషయం తెలిసిందే. ఈ దశావతారాల్లో ఒకటి శ్రీ కృష్ణావతారం. అలాంటి శ్రీకృష్ణుడు జన్మించిన రోజును మనం జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. దీనిని హిందువులంతా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండగలిగిన వారంతా ఉపవాసం ఉంటారు. అనంతరం రాత్రి సమయంలో బాల గోపాలుడి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అలాంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ముందుగా తెలుసుకుందాం.

అసలు హిందూ పంచాంగం ప్రకారం మనం ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకుంటామంటే.. శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజును మనం శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటాం. ఈ ఏడాది అష్టమి తిథి ఆగస్టు 15, 2025న రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 16, 2025న రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. పగలు తిథిని బట్టి మనం పండుగలను జరుపుకుంటాం కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్ట్ 16న జరుపుకుంటాం. ఇక ఈ రోజున నిషిత పూజ సమయం వచ్చేసి.. మధ్యాహ్నం 12:04 నుంచి 12:47 వరకూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రాత్రి వేళ మనం పూజ చేసుకోవచ్చు.

Share this post with your friends
Exit mobile version