Site icon Bhakthi TV

కాలాష్టమి ఎప్పుడు? ఆరోజున ఏం చేయాలి?

కాలభైరవుడి గురించి హిందువులందరికీ తెలుసు. త్రిమూర్తులలో లయకారుడైన శివుడి అంశగా కాలభైరవుడిని కొలుస్తారు. భయంకరమైన ఆకారంతో శివుని హూంకారం నుంచి జన్మించాడని చెబుతారు. కాలభైరవుడిని పూజిస్తే అపమృత్యు దోషం తొలగిపోతుందని నమ్మకం. ముఖ్యంగా కాలాష్టమి నాడు కాల భైరవుడిని పూజిస్తే భూత, ప్రేత, రాక్షస బాధల నుంచి విముక్తి లభిస్తుందట. ఇంతకీ కాలాష్టమి ఎప్పుడు అంటారా? ప్రతి నెలా కృష్ణ పక్షంలోని అక్షమ తిథిని కాలాష్టమిగా జరుపుకుంటారు.

ఈ రోజున కాలభైరవుడిని పూజిస్తే చాలా సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. మరి ఈ నెలలో ఎప్పుడు కాలాష్టమి రానుంది? అంటే రేపే. మే 20న మంగళవారం ఉదయం 05:51 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు అంటే మే 21న ఉదయం 04:55 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం చూసుకున్నా.. ఎలా చూసినా కూడా కాలాష్టమిని మంగళవారం జరుపుకుంటాం. ఈ రోజున ఉపవాసం ఉండటంతో పాటు దానధర్మాలు చేసినా కూడా ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందట. ఉపవాసం చేస్తే శనీశ్వరుడు, రాహువు చెడు ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుందట.

Share this post with your friends
Exit mobile version