Site icon Bhakthi TV

అజ ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు మరింత స్పెషల్ ఎందుకో తెలుసా?

అజ ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అంకితమైన రోజు. ఈ రోజున విష్ణు మూర్తిని పూజించుకుని ఉపవాసం ఉంటే చాలా మంచిదట. విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుందట. అజ ఏకాదశి రోజున నియమ నిబంధనలకు అనుగుణంగా విష్ణుమూర్తిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయట. వాస్తవానికి అజ ఏకాదశి గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ రోజున మరో రెండు శుభ యోగాలు కూడా ఏర్పడనుండటంతో ఈసారి అజ ఏకాదశి మరింత స్పెషల్‌గా మారింది. మరి ఆ రెండు శుభయోగాలేంటి? అసలు అజ ఏకాదశి ఎప్పుడో చూద్దాం.

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ఆగస్టు 29, గురువారం మధ్యాహ్నం 1:19 నుంచి ప్రారంభమై.. శుక్రవారం ఆగస్టు 30 మధ్యాహ్నం 1:37 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మనం అజ ఏకాదశిని ఉదయ తిథి ప్రకారం ఆగస్ట్ 29న అంటే రేపు జరుపుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. సిద్ధి యోగం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 6.18 వరకు.. సర్వార్థ సిద్ధి యోగం వచ్చేసి ఆగస్టు 30న సాయంత్రం 4:39 నుంచి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు ఉంటుంది. ఇక అజ ఏకాదశి నాడు సాయంత్రం 4.39 గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పూజ చేస్తే ఫలితం చాలా బాగుంటుంది.

Share this post with your friends
Exit mobile version