Site icon Bhakthi TV

జయమంత్రాన్ని ఆంజనేయడు ఎప్పుడు పఠించాడు? దాని అర్థమేంటి?

మనం ఎంతటి కష్టంలో ఉన్నా ఒక్కసారి జయమంత్రాన్ని పఠిస్తే మనసుకు సాంత్వన చేకూరుతుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆంజనేయుడు ఈ జయ మంత్రాన్ని ఎప్పుడు పఠించాడో తెలుసుకుందాం. సుందరకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యనూ లక్ష్మణుడిని.. సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రమే ఈ జయమంత్రం. ఇప్పుడు ఈ మంత్రం అర్థమేంటో తెలుసుకుందాం.

మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

Share this post with your friends
Exit mobile version