
ఒడిశాలోని పూరి ఒక దివ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి ఉంటాడు. జగన్నాథుడిని విశ్వానికి ప్రభువుగానూ.. శ్రీ మహా విష్ణువు అవతారంగానూ భావిస్తారు. ఈ క్రమంలోనూ పూరిలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి మూడు రథాలపై నగర పర్యటన గావిస్తారు. అయితే ఈ రథాలను ఏ ఏటికాయేడు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ప్రతి ఏటా మూడు రథాలను తయారు చేస్తారు. అది కూడా కొన్ని కుటుంబాలకే ఈ రథాలను తయారు చేసే భాగ్యం కలుగుతుంది. రథ నిర్మాణంలో చాలా ప్రత్యేకమైన కలపను వాడతారు.
జగన్నాథుని రథాలను ‘విశ్వకర్మ’ లేదా ‘మహారాణా’ అని పిలువబడే కొన్ని కుటుంబాలు మాత్రమే నిర్మిస్తారు. వీరికి రథాల తయారీలో అత్యంత నైపుణ్యం ఉంది. ఈ కుటుంబాల్లోని వారు ఎవరెవరు ఏం చేస్తారో కూడా తెలుసుకుందాం. ప్రధాన మహారాణా లేదా గుణకరుడు వచ్చేసి మూడు రథాల ప్లానింగ్‌తో పాటు ఇంజనీరింగ్ .. నిర్మాణాన్ని పర్యవేక్షించే ప్రధాన ఇంజనీర్. వడ్రంగి మహారాణా లేదా రథాకర్‌లు.. రథ చక్రాలు, ఇరుసులు, స్తంభాలు మొదలైన అన్ని చెక్క భాగాలను తయారు చేస్తారు. కమ్మరులు వచ్చేసి రథానికి అవసరమైన ఇనుప ఉపకరణాలైన బిగింపులు, ఉంగరాలు తయారు చేస్తారు. రూప్కార్ అనే వారు చెక్కపై సంప్రదాయ నమూనాలను తయారు చేస్తారు. చిత్రకారులు వచ్చేసి ఒడిశా సంప్రదాయ పట్టచిత్ర శైలిలో రథంలోని చెక్క శిల్పాలు, ఇతర భాగాలను చిత్రిస్తారు.
