Site icon Bhakthi TV

నరదిష్టిని తొలగించుకునేందుకు ఏం చేయాలంటే..

నరదిష్టికి రాళ్లు కూడా పగులుతాయని అంటారు. నరదిష్టి కారణంగా వ్యక్తి ఆరోగ్య పరంగానూ.. ఆర్థిక పరంగా అలాగే ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. మరి మనల్ని అంత ఇబ్బంది పెట్టే నరదిష్టిని పోగొట్టుకోవడం ఎలా? అంటే దీనిని చాలా విధాలుగా తొలగించుకోవచ్చు. అవేంటో చూద్దాం. సముద్ర జలాలకు నరదిష్టిని పోగొట్టే శక్తి ఉందని పండితులు చెబుతున్నారు. శుక్రవారం కానీ శనివారం కానీ సముద్ర తీరానికి వెళ్లి ఆ జలాలను బాటిల్‌లో తెచ్చి వ్యాపార స్థలంలో కానీ.. ఇంటి పరిసరాల్లో కానీ చల్లితే నరదిష్టి పోతుందట.

ఇక నరదిష్టిని పోగొట్టుకునేందుకు మరో మార్గం కూడా ఉంది. రోజూ కాస్త దొడ్డు ఉప్పును మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందట. అలాగే నరదిష్టిని పోగొట్టుకునేందుకు సాంబ్రాణి కూడా ఒక మార్గమట. అమవాస్య లేదా పౌర్ణమి, అష్టమి, నవమి తిథుల్లో.. సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో సాంబ్రాణితో ధూపం వేస్తే నరదిష్టి తొలగిపోతుందట. మంగళవారం ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డు ఉప్పును మూటకట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కానీ కడితే నరదిష్టి తొలగిపోతుందట.

Share this post with your friends
Exit mobile version