Site icon Bhakthi TV

ఆషాఢమాసంలో ఏ రోజున ఏ ఏ వ్రతాలు నిర్వహిస్తారంటే..

వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం. ‘ఆషాఢ శుద్ధ విదియనాడు’ పూరీ జగన్నాథ రధయాత్ర. ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’గా పేర్కొంటారు. ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము – సృమతి కౌస్తుభం’ ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం ఉండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి.

ఆషాడ శుద్ధ సప్తమి – మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురణము. ద్వాదశ సప్తమీ వ్రతము. చతుర్వర్గచింతామణి.

ఆషాడ శుద్ధ అష్టమి – మిహషఘ్ని పూజ, సృ్మతి కౌస్తుభం

ఆషాడ శుద్ధ నవమి – ఐంద్రదేవి పూజ

ఆషాడ శుద్ధ దశమి – శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము.

ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం.

ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాం తరాది దినము అంటారు. ఈ మాసంలో జగన్నాథుని రధయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది.

Share this post with your friends
Exit mobile version