Site icon Bhakthi TV

శరత్ పూర్ణిమ రోజున ఏ ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది?

శరత్ పూర్ణిమ ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాం. శరత్ పూర్ణిమ రోజున రాధాకృష్ణులతో పాటు శివపార్వతులను, లక్ష్మీదేవి, చంద్రుడిని పూజించుకుంటామని కూడా చెప్పుకున్నాం. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదట. సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతామట. ముఖ్యంగా అన్నవితరణ చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది సుఖసంతోషాలతో పాటు సంపదను ప్రసాదిస్తుందట. శరత్ పూర్ణిమ రోజున ఏ ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం.

బియ్యం: లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన బియ్యాన్ని శరత్ పూర్ణిమ రోజున దానం చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందట.

పాలు: స్వచ్ఛతకు చిహ్నమైన పాలను శరత్ పూర్ణిమ రోజున దానం చేయడం వలన మన ఇంట పాజిటివ్ ఎనర్జీతో పాటు ధన లాభం చేకూరుతుందట.

చందనం: శుభానికి చిహ్నంగా భావించే గంధాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట సుఖశాంతులు నెలకొంటాయట.

వస్త్రాలు: పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల పుణ్యంతో పాటు ధన లాభం కలుగుతాయి.

పండ్లు: దేవతలకు ప్రీతికరమైన పండ్లను దానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందట.

బెల్లం: శ్రేయస్సు, ఆనందానికి చిహ్నమైన బెల్లాన్ని దానం చేస్తే సంపద వృద్ధితో పాటు పితృ దోషాలు తొలగిపోయి పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.

దీప దానం: జ్ఞానానికి ప్రతీక అయిన దీపదానం చేస్తే మేధస్సు అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.

Share this post with your friends
Exit mobile version