
అన్నపూర్ణ జయంతి ఎప్పుడో తెలుసుకున్నాం కదా. డిసెంబర్ 15వ తేదీన మనం అన్నపూర్ణ జయంతిని జరుపుకోనున్నాం. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేస్తే మంచిదని చెబుతారు. ముఖ్యంగా అన్నదానం చేస్తే ఆ ఇంట ఆహారానికి లోటుండదని చెబుతారు. అన్నపూర్ణ జయంతి రోజున అన్నదానం, వస్త్రదానం చేసిన వారికి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అన్నపూర్ణ జయంతి పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం. అన్నపూర్ణ జయంతి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తర్వాత పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేయండి.
ఈ రోజున ఉపవాసం ఉండాలనుకుంటే.. ముందుగానే ఉపవాస తీర్మానం చేసుకోండి. పూజకు ముందుగానే కావల్సిన సామాగ్రి కుంకుడు, పసుపు, అక్షతలు, నైవేద్యం, తులసి దళాలు మొదలైన వాటిని సిద్దం చేసుకోండి. పూజా స్థలంలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. ఆ తర్వాత అమ్మవారి ముందు ధూపం, దీపం వెలిగించండి. ఈ తరువాత అమ్మవారి పూజ చేయాలి.పూజ సమయంలో అన్నపూర్ణ దేవి తల్లి స్తోత్రాలు, మంత్రాలను పఠించాలి. ముఖ్యంగా ‘ఓం అన్నపూర్ణాయై నమః’ 108 సార్లు జపిస్తే మంచిదని చెబుతారు. అనంతరం అమ్మవారికి హల్వా, పూరీలతో పాటు కూరగాయలను నైవేద్యంగా సమర్పించాలి.
