Site icon Bhakthi TV

సంకటహర చతుర్థి పూజా విధానం ఏమిటి?

సంకటహర చతుర్థి ఎప్పుడో తెలుసుకున్నాం కదా. ఈ నెల 18న మనం సంకటహర చతుర్థిని జరుపుకోనున్నాం. సంకటహర చతుర్థి పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. సంకష్ట చతుర్థి రోజున తెల్లవారుజామున నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. శుభ్రమైన బట్టలు ధరించి ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తరువాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా గంగాజలం చల్లి శుద్ధి చేయాలి. అనంతరం ఒక పీటను తీసుకుని దానిపై గణేశుడు, శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. గణేశుడి నుదుటిపై తిలకం దిద్ది పువ్వుల మాల సమర్పించండి.

వినాయకుడి చిత్రపటం ముందు దేశీ నెయ్యి దీపం వెలిగించి గణేశుడి పూజ మొదలు పెట్టాలి. పూజ పూర్తైన అనంతరం పూర్తి ఆచారాలతో గణపతి బప్పాకు హారతి ఇవ్వాలి. ఆ తరువాత వినాయకుడికి ఇష్టమైన మోదకం, పండ్లు సమర్పించండి. ఆ తరువాత మనసులోని కోరికను వినాయకుడికి చెప్పి పూజను ముగించాలి. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని నియమ నిష్టలతో పూజిస్తే అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుందని నమ్మకం. గణేశుడు మేధస్సుకు అధి దేవుడిగా భావిస్తారు కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల తెలివితేటలు వృద్ధి చెందడంతో పాటు జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తిని నింపుతుంది.

Share this post with your friends
Exit mobile version