Site icon Bhakthi TV

అట్ల తద్ది పూజా విధానం ఏమిటి?

అట్ల తద్ది ఎప్పుడు? ఎవరు నిర్వహించుకుంటారు? అనేది మనం ఇప్పటికే తెలుసుకున్నాం. పేరంటాలను పిలిచి వాయనాలు ఇచ్చి.. గోపూజ చేసి కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయల కట్టి ఆడవాళ్లంతా ఊగుతూ సరదాగా పండుగను జరుపుకుంటారు. అట్లతద్ది నోము జరుపుకునేవారు పదేళ్ల పాటు జరుపుకుంటారు. ఈ వ్రతం చేసుకునే వారు ఒకరోజు ముందుగా చేతికి, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. అనంతరం అట్లతద్ది రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానాలు ముగించి పదకొండు మంది ముత్తైదువులను పిలుస్తారు.

ముత్తదువులతో కలిసి పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగుతో భోజనం చేస్తారు. ఇక ఆ తర్వాత సాయంత్రం వరకూ మంచి నీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. ఆ తరువాత చెట్టుకు ఊయల కట్టి ఊయల ఊగుతారు. ఇక సాయంత్రం సమయంలో మళ్లీ శుచిగా స్నానమాచరించి ముత్తైదువులతో కలిసి గౌరీపూజ నిర్వహిస్తారు. అమ్మవారికి పువ్వులు, తమలపాకు, తులసీదళం వంటి వాటితో పూజ నిర్వహిస్తారు. అమ్మవారికి పాలతాలికలు, పులిహోర, కుడుములను నైవేద్యంగా సమర్పిస్తారు. గౌరీ పూజ అనంతరం ఫలహారం తీసుకుంటారు.

Share this post with your friends
Exit mobile version