Site icon Bhakthi TV

‘కస్తూరీ తిలకం లలాటఫలకే’ అంటూ సాగే కృష్ణుడి వర్ణనకు అర్థం ఏంటంటే..

శ్రీకృష్ణుడి గురించి ఎందరో కవులు ఎన్నో వర్ణనలు చేశారు. అయితే వాటన్నింటినీ మనం వింటూనే ఉంటాం కానీ దాని అర్థం తెలియదు. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చిత్ర పటంలో ఎలా కనిపిస్తాడో దానికి సంబంధించిన వర్ణన చేస్తూ ఓ వర్ణన ఉంటుంది. దాదాపుగా మనం దానిని ఎన్నో సార్లు విని ఉంటాం కానీ.. దాని అర్థం మాత్రం తెలియదు. ‘కస్తూరి తిలకం లలాటఫలకే’ అంటూ సాగుతుంది వర్ణన. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం.

కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!

శ్రీకృష్ణుడు లలాటంపై కస్తూరి తిలకం, ఛాతీపై కౌస్తుభ మణి, ముక్కు చివర ముత్యపు నాసాభరణం, చేతిలో వేణువు, మరో చేతిలో కంకణం, శరీరమంతా హరిచందనం, మెడలో ముత్యాల హారం ధరించి ఉన్నాడు. చుట్టూ గోపికలు ఉండగా, గోపాలకృష్ణుడు విజయవంతంగా వెలుగుచేస్తున్నాడు.

Share this post with your friends
Exit mobile version