Site icon Bhakthi TV

భానుసప్తమి ఉపవాసం, జపించాల్సిన మంత్రం ఏంటంటే..

భానుసప్తమికి సంబంధించి ఇప్పటికే చాలా విశేషాలు తెలుసుకున్నాం. భానుసప్తమి నాడు అర్ఘ్యం సమర్పించడం, పూజకు సంబంధించిన విషయాలను ఇప్పటికే తెలుసుకున్నాం. అత్యంత విశేషమైన భానుసప్తమి రోజు ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. భానుసప్తమి రోజున మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం గోధుమలతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. భానుసప్తమి నాడు జపించాల్సిన మంత్రం కూడా ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం.

భానుసప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైన ‘‘ఓం సవిత్రే నమః’’ అనే మంత్రం జపించడం వల్ల స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని అంటున్నారు. ఇలా భానుసప్తమి రోజు స్నానం, అర్ఘ్యం, దీపం, దానం, ఉపవాసం, మంత్రం ఈ ఆరింటిలో ఏదీ చేసినా సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతారు. కొందరు పరిస్థితుల కారణంగా ఇవేవీ చేయలేని వారు పైన చెప్పిన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకున్నా సరిపోతుందట. ఈ మంత్రం చదవడమే కాకుండా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం విన్నా అద్భుత ఫలితాలుంటాయి.

Share this post with your friends
Exit mobile version