Site icon Bhakthi TV

శ్రీవారి ప్రసాదం ప్రత్యేకతలేంటంటే..

శ్రీవారికి సమర్పించే నైవేద్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఏ సమయంలో ఏ ఆహారం సమర్పిస్తారు? వంటివి కూడా తెలుసుకున్నాం. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తారేది కూడా ఇప్పటికే తెలుసుకున్నాం కదా. గర్భాలయాన్ని శుద్ధి చేసిన మీదట గాయత్రీ మంత్రంతో నీళ్లు చల్లి ప్రసాదాలను మూతపెట్టిన పాత్రల్లో ఉంచుతారు. నైవేద్యం సమర్పించే సమయంలో బయటవారిని ఎవ్వరినీ కూడా అనుమతించరు. ఇక ప్రత్యేకతలేంటో కూడా తెలుసుకుందాం.

ఉదయాన్నే తాజా వెన్న, పాలు సమర్పిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం. రాత్రి శయనభోగం తర్వాత కూడా అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం సమర్పిస్తారు. చివరగా ఏకాంతసేవలో పండ్లు, వేరుశనగలు, వేడి పాలు సమర్పిస్తారు. ఇక ప్రసాదాల ప్రాధాన్యమేంటో కూడా తెలుసుకుందాం. శ్రీ మలయప్ప స్వామివారికి సమర్పించే పదార్థాలన్నీ హింసలేని, ఔషధ గుణాలున్నవి కావడం విశేషం. ఇన్ని విశేషాలున్న ప్రసాదం అంటే ఆకలి తీర్చడం మాత్రమే కాదు, పవిత్రంగా స్వీకరించవలసిన దైవ అనుగ్రహమని భక్తులు తెలుసుకోవాలి.

Share this post with your friends
Exit mobile version