
కుమారస్వామిని స్కందుడు అంటారని.. ఆయనకు సంబంధించినదే స్కాందపురాణమని పేర్కొంటారు. దీనిలో వ్రతాల గురించి వివరించారని కూడా చెప్పుకున్నాం. అసలు వాయనంలో ఏం ఏం వస్తువులు వాడతారు? వాటి కారణంగా ప్రయోజనాలేంటో కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వ్రతాల గురించి స్కాంద పురాణంలో ఏం వివరించారో చెప్పుకుందాం. కుమారస్వామి మానవాళి సమస్తం ఈతి బాధలతో సతమతమవుతుండటాన్ని చూసి కలవరపాటుకు గురయ్యాడట. కుమారస్వామి బాధను అర్థం చేసుకున్న పార్వతీదేవి.. శివుడికి ఈ విషయాన్ని నివేదిస్తుంది.
అప్పుడు శివుడు.. పార్వతీదేవి సమక్షంలో కుమారస్వామికి భూలోక వాసుల ఇబ్బందులను తొలగించే వ్రతాన్ని ఉపదేశించాడట. ఆయన ఉపదేశించిన వ్రతాన్నే ఇప్పుడు మహిళలంతా చేసుకుంటున్నారు. కుమారస్వామిని సమస్త జీవులకు ప్రతినిధిగా పేర్కొంటారు. మహిళలు దాదాపుగా ఐదోతనం కోసమే పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. అయితే సంతానం లేని మహిళలు మాత్రం సంతానం కోసం నోములు నోచుకుంటారు. మరికొందరు సంతానం క్షేమాన్ని కోరుకుంటూ చేసుకుంటారు తప్ప మహిళలు తమ కోసం తాము చేసుకునే వ్రతం ఏ ఒక్కటీ లేదు.
