Site icon Bhakthi TV

‘ఆరా’ అంటే ఏమిటి? యోగులు, మహర్షులు చుట్టూ ఇది ఎంతమేర ఉంటుంది?

భగవంతుని చుట్టూ ఉన్న కాంతివలయమును ‘ఆరా’ అంటారు. ఆ ఆరా ప్రతీ ప్రాణి చుట్టూ కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంత వలయంలా ఉంటుంది. జీవరాసులన్నింటికీ దేహం చుట్టూ ‘ఆరా’గా పిలవబడే కాంతి వలయముంటుంది. ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ ప్రకాశం.ఈ కాంతి ఆత్మ సాక్షాత్కారం అయిన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది. సామాన్యుల దృష్టికి ఇది కనబడదు సాధరణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం ఐదు నుంచి పది అడుగుల వరకూ ఉంటుంది. ఈ వలయంలోనికి ప్రవేశించిన మరోవ్యక్తి ‘ఆరా’ ఆకర్షణలు పడతాయి.

ఇలా ఒకరి ‘ఆరా’ మరొకరి ‘ఆరా’ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికీ ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులౌతారు, సన్నిహితులౌతారు. వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు. అలానే యోగులు, మహర్షులు చుట్టూ ఈ ‘ఆరా’ ఇరవై ఐదు నుంచి ముప్పది అడుగులమేర విస్తృతంగా, ధృడంగా ఉంటుంది. అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతిశక్తి ఎక్కువగా ఉంటుంది.
‘ఆరా’ బలహీనపడితే రోగాలబారినపడి వ్యాధిగ్రస్తులమవుతాం. ‘ఆరా’ పూర్తిగా శిధిలమైనప్పుడు ప్రాణం పోతుంది. అందుకే నిత్యం ధ్యానం చేయాలి.

Share this post with your friends
Exit mobile version