Site icon Bhakthi TV

ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి తోకకు వెన్న రాస్తే ఏం జరుగుతుందంటే..

ఏదైనా భయాన్ని జయించాలన్నా.. శత్రుజయం కలగాలన్నా, కార్యసిద్ధి కోసం తప్పనిసరిగా హనుమంతుడిని పూజించుకుంటూ ఉంటాం. ఆంజనేయ స్వామికి పూజ చేయాలనుకునేవారు సింధూర పూజ, ఆకుపూజ, వడమాల సమర్పించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒక క్షేత్రంలో మాత్రం సింధూరంతో పూజించడమో మరొకటో చేయరు. హనుమంతుడి తోకకు వెన్న పూస్తారు. అలా చేస్తే చాలు. స్వామివారు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడట. ఇంతకూ ఆ ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటి? వంటి విషయాలన్నింటినీ ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశంలో ప్రతి గ్రామంలోనూ హనుమంతుడి ఆలయమో లేదంటే విగ్రహమో తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ హనుమంతుడి విగ్రహమున్నా సింధూర వర్ణంతోనే ఉంటుంది. అయితే తమిళనాడులో మాత్రం ఆంజనేయుడికి ఆలయాలు తక్కువేనని చెప్పాలి. అయితే ప్రఖ్యాతిగాంచిన ఆలయాలున్నాయి. వాటిలో సుచీంద్రం ఒకటి.

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో ఆంజనేయ స్వామి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా సుచీంద్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి వెళ్లిన వారు ఆంజనేయ స్వామి తోకకు వెన్న పూస్తే చాలు.. తప్పనిసరిగా కోరిన కోరిక నెరవేరుతుందట.

Share this post with your friends
Exit mobile version