Site icon Bhakthi TV

ముఖ లింగాలను పూజిస్తే ఏం జరుగుతుందంటే..

అసలు శివలింగాలు ఎన్ని? రంగు, ఆకారం, కొలతలను అనుసరించి శివలింగాలెన్నో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముఖ లింగాల గురించి తెలుసుకుందాం. మనం ముఖలింగాలను అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలింగం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు. అయితే ఆరుముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలను, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం.

ఏకముఖ లింగం:

ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుం టాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపురంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నెైరుతిదిక్కులో ఉంటాయి. పదోన్నతి, అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు, ఈ తత్పురుష లింగపూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. అలాగే ఈ ఏకముఖి రుద్రాక్ష తో 11-121 సంఖ్యలో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసికశాంతి.

ద్విముఖలింగం:

శివలింగానికి తూర్పు- పడమరల లో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం. తూర్పుముఖం తుత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశెైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరర్రచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము.

Share this post with your friends
Exit mobile version