Site icon Bhakthi TV

వివాహ పంచమి నాడు అరటి చెట్టును పూజిస్తే ఏం జరుగుతుంది?

ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన మనం వివాహ పంచమి వేడుక జరుగనుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలోని ఐదవ రోజున వివాహ పంచమి వేడుకను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే వివాహ పంచమి రోజున మనం అరటి చెట్టును పూజించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అరటి చెట్టు శ్రీ మహావిష్ణువుకే కాకుండా.. లక్ష్మీదేవి, దేవ గురువు బృహస్పతికి సంబంధించినదని చెబుతారు. కాబట్టి ఇంట్లో అరటి చెట్టును నాటడం చాలా మంచిదని చెబుతారు. అరటి చెట్టు ఇంట ఉంటే సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

అరటి చెట్టుకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇంటి ప్రాంగణంలో లేదా తోటలో అరటి చెట్టును పెంచితే శుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించుకుంటారు. వివాహ పంచమి నాడు అరటి చెట్టు ప్రాధాన్యత ఏంటంటే.. ఈ రోజున అరటి చెట్టును పూజించడం వలన గురు గ్రహం కారణంగా ఏమైనా ఇబ్బందులు పడేవారుంటే దానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా వివాహంలో లేదా వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు… వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయట.

Share this post with your friends
Exit mobile version