Site icon Bhakthi TV

మనసును మంత్రజపంలో నిమగ్నం చేస్తే ఏం జరుగుతుంది?

పేదవాడు, భూతం కథను మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా.. కథ ఇంతటితో ముగియలేదని చెప్పుకున్నాం. ఆ భూతమే మనసని.. ఎప్పుడూ ఆలోచనలతో పరుగెడుతూ, కోరికలతో విసుగుపెట్టిస్తుందని తెలుసున్నాం. ఇక పేదవాడు భూతంతో పెట్టించిన స్తంభం ఏంటంటారా? అది మంత్రం.

దైవనామస్మరణ, జపం మనసుకు క్రమం నేర్పుతుంది. మనసును మంత్రజపంలో నిమగ్నం చేస్తే అది శాంతిస్తుంది, ధ్యాన స్థితిలోకి చేరుతుంది.

ధ్యానంలో మునిగితే మనలోని ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆ వెలుగు మనకే కాక, ఇతరుల సౌఖ్యానికి మార్గం చూపిస్తుంది.

1. ఖాళీ కుండలో ఆకాశం వచ్చేసి పరమాత్మ.
2. నీరు నింపిన కుండలోని ఆకాశం వచ్చేసి జీవాత్మ.
3. నీటిలో కనిపించే ప్రతిబింబ ఆకాశం వచ్చేసి మాయ జగత్తు.

అనేకత్వంలో ఏకత్వం అనుభవించటం = వైష్ణవం.
ఏకత్వంలో అనేకత్వం అనుభవించటం = శైవం.

ఆత్మజ్ఞానం..

శరీరమే “నేను” అనుకున్నంత వరకు – భౌతిక విషయాలకు ప్రాధాన్యం.
ఆత్మనే “నేను” అనుకున్న క్షణం నుంచి – ప్రేమ, సత్యం, స్వచ్ఛతకు ప్రాధాన్యం.
జ్ఞానమనే స్వర్ణాలయంలో శివుడు పరిశుద్ధ జ్ఞానంగా ప్రకాశిస్తాడు. జ్ఞాన నేత్రాలతో ఆయనను గ్రహించే వారే నిజమైన శివారాధకులు. మన మనసును మంత్రజపం ద్వారా అదుపులో పెట్టగలిగితే దివ్య జ్యోతి ప్రత్యక్షమవుతుంది. జ్యోతి లోనే దైవదర్శనం లభిస్తుంది. మన జీవితాన్ని ఆనందంగా మార్చుకునే బాధ్యత మనదే.

Share this post with your friends
Exit mobile version