Site icon Bhakthi TV

ఆలయ ఛాయ మీ ఇంటిపై పడితే ఏం జరుగుతుంది? దానికి ఏం చేయాలి?

ఒక ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉన్నా.. లేదంటే ఎంత కష్టపడుతున్నా ఫలితం దక్కకున్నా వాస్తు దోషం కారణమని అర్థం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు దోషం విషయంలో మన ప్రమేయం ఉండవచ్చు.. ఉండకపోనూ వచ్చు. మన ప్రమేయం లేకుండా వాస్తు దోషం తలెత్తితే దానిని వేదా దోషమని పిలుస్తారు. అయితే కొన్ని సార్లు చెట్టు నీడ మన ఇంటిపై పడినా కూడా దోషం తలెత్తుతుంది. అలాగే మన ఇంటికి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉన్నా.. దాని నీడ ఇంటిపై పడినా కూడా దోషం తలెత్తుతుందట. వృక్ష, ఆలయ ఛాయా దోషాల గురించి తెలుసుకుందాం.

వృక్ష ఛాయా దోషం: మీ ఇంటి ముందు ఏదైనా భారీ వృక్షం ఉంటే దాని నీడ మీ ఇంటిపై పడితే దాని కారణంగా వృక్ష ఛాయదోషం ఏర్పడుతుందట. దీని వల్ల కూడా జీవితంలో తొందరగా సక్సెస్ రాదని పండితులు చెబుతున్నారు. ఎంత కష్టపడినా సక్సెస్‌ను మాత్రం అందుకోలేమట.

ఆలయ ఛాయా దోషం: గుడి దగ్గరగా మీ ఇల్లు ఉంటే దాని నీడ మీ ఇంటిపై పడితే ఆలయ ఛాయా దోషం ఏర్పడుతుందట. ఫలితంగా జీవితంలో త్వరగా సక్సెస్ కారని చెబుతున్నారు. ఇలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే ఎనిమో మీటర్ అనే ప్రత్యేక పరికరాన్ని ఇంటిపై పెట్టాలని సూచించారు.

Share this post with your friends
Exit mobile version