Site icon Bhakthi TV

స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుంది?

కన్ను అదరడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. దానికి శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ కన్ను అదరడం అనేది శుభమా? అశుభమా? తెలియక కొందరు ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అది ఏదైనా మంచి జరుగుతుందనడానికి సూచన అని పేర్కొంటున్నారు. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే దీర్ఘకాలంగా ఆశిస్తున్నదేదో జరుగుతుందట. అలాగే కుటుంబంలోనూ సుఖ సంతోషాలు నెలకొంటాయనడానికి ఎడమ కన్ను అదరడం సంకేతమని పండితులు చెబుతున్నారు.

కాబట్టి ఎడమ కన్ను అదిరితే మహిళలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదట. అంతా మంచే జరుగుతుందట. ఇక కన్నులో అదిరే భాగాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట. కన్ను అదరడం అంటే కంటిలోని ఏదో ఒక భాగం మాత్రమే అదురుతుంది. ఎడమ కంటి పై రెప్ప లేదంటే కింది రెప్ప.. అదీ కాదంటే రెండు రెప్పలు అదురుతాయి. ఇలా అదిరితే వివాహం కానీ వారికి త్వరలోనే వివాహం నిశ్చయం కానుందనేందుకు సంకేతమట. కంటిలో ముక్కుకు దగ్గరగా అదిరితే జీవితంలో మనం ఊహించని అదృష్టం ఏదో రానుందనేందుకు సంకేతమని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version