Site icon Bhakthi TV

ఆంగ్ కోర్ వాట్ విశేషాలు ఇంకా ఏంటంటే..

ఆంగ్ కోర్ వాట్ అంటే అర్థం ఏంటో ముందుగా తెలుసుకుందాం. పూర్వం దీనిని ‘కాంభోజ’ అని పిలిచేవారు. అయితే అప్పట్లో యూరోపియన్లకు వలసల తరువాత, ఆ పేరును ఉచ్చరించడం వారికి కష్టంగా మారడంతో కాంభోజ కాస్తా కంబోడియాగా మారింది. ఆంగ్ కోర్ వాట్ దేవాలయం ఆలయాల సముదాయం. దీని చుట్టూ వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఆంగ్ కోర్ అంటే ఆలయాల నగరం అని అర్థం. దేవాలయంపై బౌద్ధ మతం ప్రభావం ఉండటమే కాకుండా ఒకానొక సమయంలో దీనిని బౌద్ధారామంగా మార్చడానికి ప్రయత్నం జరిగింది. దీనిలో భాగంగా ఆలయంలో బుద్ధుని విగ్రహాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది.

20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో జరిపిన పురావస్తు తవ్వకాలు జరిపాయి. దీనిలో చాలా సమాచారం లభించింది. ఖైమర్ మత విశ్వాసాలు, కళాఖండాలు, భారతీయ సంప్రదాయాల గురించి చాలా విషయాలు తెలిశాయి. ఇక్కడికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఆంగ్ కోర్ వాట్ ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆంగ్ కోర్ వాట్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలోనూ స్థానం లభించింది. ఇక్కడ వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనాలతో పాటు ఆలయ అందాలు, ఆలయ చరిత్ర, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అందమైన దృశ్యాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

Share this post with your friends
Exit mobile version