Site icon Bhakthi TV

జ్యేష్ట పౌర్ణమి నాడు ఏ ఏ రాశుల వారు ఏమేం దానాలు చేయాలి?

జ్యేష్ట పౌర్ణమి ఎప్పుడు అనేది తెలుసుకున్నాం కదా. ఆ రోజున ఎవరిని పూజించాలో కూడా తెలుసుకున్నాం. అయితే జాతకంలో చంద్రదోషం ఉన్నవారు ఈ రోజున దానాలు చేస్తే దోషం నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా దానాలు చేస్తారు. కాబట్టి జ్యేష్ట పౌర్ణమి నాడు ఏ ఏ రాశుల వారు ఏమేం దానాలు చేయాలో తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఖీర్‌ని ప్రసాదంగా అందరికీ పంచి పెట్టడం వలన జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.

వృషభ రాశి: ఈ రోజున వృషభ రాశి వారు పేదవారికి పెరుగు లేదా నెయ్యి దానం చేస్తే మంచి జరుగుతుంది.

మిథునం: వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ రోజున పాలు లేదా బియ్యం దానం చేయాలి,

కర్కాటక రాశి: చక్కెర కలిపిన పాలను, మిఠాయిని దానం చేస్తే అన్ని పనుల్లోనూ సక్సెస్ లభిస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారు బెల్లం దానం చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి.

కన్య రాశి: ఈ రాశి వారు ఖీర్ దానంచేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి.

తులారాశి: పాలు, బియ్యం, నెయ్యి దానం చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.

వృశ్చిక రాశి: ఎరుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగులో ఉన్న ఏదైనా వస్తువును దానం చేస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు రాశి: పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి లభిస్తాయి.

మకర రాశి: బియ్యాన్ని ప్రవహిస్తున్న నదిలో విడిచి పెట్టడం వలన దోషాల నుంచి విముక్తితో పాటు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది.

కుంభ రాశి: పేదవారికి అన్నం పెడితే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.

మీన రాశి: బ్రాహ్మణులకు అన్న వితరణ చేస్తే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.

Share this post with your friends
Exit mobile version