Site icon Bhakthi TV

వారాహి అమ్మవారికి ఏమేం అంటే ఇష్టమంటే..

వారాహి అమ్మవారు ఎన్నో సమస్యలకు పరిహారం ఇస్తుంది, ముఖ్యంగా ఆస్తి తగాదాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రు బాధలు, గ్రహ బాధలు, ప్రయోగ బాధలు నుంచి విముక్తి కలిగిస్తుంది. రానున్న రోజుల్లో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏ కుటుంబంలో వ్యక్తులు అయినా వారిని దూరం చేసికునే పరిస్థితి రాకూడదు. సమస్యలు వచ్చినా అవి దాటగల శక్తి అమ్మవారు అనుగ్రహించాలి. ప్రతి కుటుంబానికి ఆమె రక్ష ఉండాలి. ఉదయం లలితా సహస్రనామ పారాయణ చేయండి. సాయంత్రం 6 గంటల తర్వాత వారాహి పూజ మొదలుపెట్టాలి.

అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం ఇప్ప నూనెతో దీపారాధన, ఇప్ప పువ్వులు దొరికితే పూజలో వాడండి, ఆ తల్లికి ప్రతి రోజు నివేదనలో యధాశక్తిన గుండ్రటి పండ్లు నైవేద్యం పెట్టాలి, లడ్డూలు (నువ్వులు బెల్లం నైయ్యి, ఇలాచి), పనస పండు చాలా విశేషం.. బెల్లం పానకం కచ్చితంగా పెట్టాలి. కందగడ్డతో వంట నైవేద్యం, కంద దీపం, దుంపలు, చిలకడ దుంపలు ఉడికించి బెల్లం కలిపి పెట్టడం.. దానిమ్మ పండ్లు, దానిమ్మ గింజలతో అర్చన.. పుట్టతేన నైవేద్యం.. అమ్మవారికి చేసే హోమంలో, తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనసతో చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి.

Share this post with your friends
Exit mobile version