Site icon Bhakthi TV

‘సహస్రశీర్షా పురుషః..’ అంటే ఏమిటి? ఎవరు?

విశ్వరూపం విషయానికి వస్తే అది కృష్ణుడు అర్జునుడి సంశయాన్ని పోగొట్టడానికి చూపెట్టిన రూపం.శ్రీకృష్ణుడు ప్రకృతి రూపంలో కనిపిస్తున్న భగవంతుని శక్తి. భగవంతుడు అంటే కేవలం చైతన్యం మాత్రమే ప్రకృతిలోని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే వాటి పరిణామంతో ఏర్పడిన విశ్వమే ఇది. కేవలం అర్జునుడి అవగాహన కొరకు కృష్ణుడు చూపించిన రూపమిది. ఋగ్వేదంలో పురుషసూక్తం ఉంది. మనం ఏ గుడికి వెళ్లి పూజ చేయించినా అక్కడ ముఖ్యంగా వినిపించే సూక్తమిది.‘సహస్రశీర్షా పురుషః..’ అంటూ మొదలవుతుంది. విశ్వాన్నంతా ఒకే వ్యక్తిగా కల్పించి వర్ణించిన భావన ఇది.

‘సహస్రశీర్షా పురుషః..’ అంటే ఏమిటి? ఎవరు?

ఈ వ్యక్తిని విరాట్‌ పురుషుడైన శ్రీకృష్ణుడు అన్నారు. ఈ వ్యక్తికి వేయి తలలు అన్నారు. అంటే సరిగ్గా లెక్కపెట్టి వేయి అని కాదు. లెక్కించడానికి వీలులేని సంఖ్యలో ఉన్న తలలు అని అర్థం. అలాగే అనంతమైన సంఖ్యలో కళ్లు, పాదాలు, అవయవాలు. ఇవన్నీ ఎక్కడివి అంటే ఇవన్నీ మనమే అన్నారు. సృష్టిలోని ప్రతీ జీవి తల, అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ఆ విరాట్‌ పురుషుడైన శ్రీకృష్ణుని కి చెందినవే. సృష్టి ప్రారంభం నుంచి పుట్టి, నశించిన జీవులన్నీ ఈ విరాట్‌ స్వరూపమే. మన శరీరంలో ఎన్నో కోట్ల జీవకణాలు పుడుతూ, మరణిస్తున్నట్లు..శ్రీకృష్ణుని విరాట్‌ స్వరూపంలో భూత, వర్తమాన, భవిష్యత కాలాల్లోని జీవరాశులన్నీ ఇమిడిపోయాయి. మన మిత్రులు, శత్రువులు ఇందులో భాగమే.

Share this post with your friends
Exit mobile version