Site icon Bhakthi TV

కలలో వినాయకుడు కనిపిస్తే అర్థం ఏమిటి?

వినాయక నవరాత్రులను దేశమంతా సంప్రదాయబద్దంగా అత్యంత కోలాహలంగా నిర్వహించుకుంటోంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో రూపంలో వినాయకుడు కొలువుదీరాడు. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకూ భక్తులంతా వినాయకుడి సేవలోనే తరిస్తున్నారు. కలలో కూడా కొందరికి గణేశుడే కనిపిస్తున్నాడు. మరి అలా వినాయకుడు కలలో కనిపిస్తే అర్థం ఏమిటి? ఎలా పరిగణించాలి? తెలుసుకుందాం. ముఖ్యంగా వినాయక నవరాత్రుల్లో ఎవరికైనా విఘ్నరాజాధిపతి కలలో కనిపించడం చాలా మంచిదని భావిస్తారు.

వినాయకుడు నవరాత్రుల్లో కలలో కనిపించడమనేది శుభంగానూ.. స్వామివారి అనుగ్రహం లభించినట్టుగానూ భక్తులు పరిగణించడం జరుగుతోంది. కోరుకున్న కోరికలన్నీ నిజమవుతాయని కూడా చెబుతారు. అసలు వినాయకుడు కలలో కనిపించిన దానికి అర్థం ఏమిటంటే.. విజయం, శ్రేయస్సుతో పాటు సరైన మార్గంలో వినాయకుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడని అర్థం. గణేశుడు మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సైతం తొలగిస్తాడని చెబుతారు. కలలో గణనాథుడు కనిపించడం వలన మనకు ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయట.

Share this post with your friends
Exit mobile version