Site icon Bhakthi TV

అంబుబాచి సమయంలో నాగ సాధువులు ఏం చేస్తారంటే..

గౌహతిలోని నీలాచల్ కొండలోని కామాఖ్య ఆలయంలో జరిగే అంబుబాచి మేళా గురించి తెలుసుకున్నాం కదా. నేటి నుంచి ఈ నెల 26 వరకూ ఈ మేళా జరుగుతుంది. ఈ సమయంలో కామాఖ్య అమ్మవారికి పిరియడ్స్ వస్తాయని చెబుతారు. కాబట్టి మూడు రోజుల పాటు పూర్తిగా ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. మూడు రోజుల తర్వాత అమ్మవారికి సంప్రదాయ స్నానం చేయించి పూజలు నిర్వహించిన మీదట ఆలయ తలుపులు తెరుస్తారు. ఈ అంబుబాచి మేళా సమయంలో ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

సంగీత వాయిద్యాలను ఉపయోగించడం కానీ.. శబ్దంతో ఊరేగింపులు నిర్వహించడం వంటివి పూర్తిగా నిషేధించడం జరిగింది. 51 శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య ఆలయం అత్యంత శక్తిమంతమైనది. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిపోయిందని చెబుతారు. అంబుబాచి సమయంలో పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి నాగసాధవులు ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో నాలుగు రోజుల పాటు వారంతా ప్రపంచ శాంతి కోసం మహాయజ్ఞం చేస్తారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో నాగ సాధువులు మౌనం పాటిస్తూ తమను తాము అమ్మవారికి అంకితం చేసుకుంటారు. ఈ సమయంలో నాగబాబాలు సాత్విక పూజ నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version