
ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివ భక్తుడు ఉండేవాడు. అతను నిత్యం శివ నామ స్మరణ చేయకుండా మంచి నీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు. అతనికి కొద్దిగా వ్యవసాయ భూమి ఉంది. దానిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. నిత్య అనుష్ఠానపరుడు అయిన సదరు భక్తుడు శివనామమే ఊపిరిగా బతికేవాడు. ఏ పని చేసిన శివ నామ స్మరణతోనే చేసేవాడు. నిత్యం రకరకాల పూలతో శివయ్యను అలంకరించి పూజించి మురిసిపోయేవాడు. అతని భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ ఉండేవాడు. అలా అతనికి కూడా శివునిపై భక్తి భావన ఏర్పడింది. పూజ చేయ లేకున్నా నిత్యం శివనామస్మరణ మనసులోనే చేస్తూ ఉండేవాడు.
గొల్లవానికి కూడా శివుడిని పూజించుకోవాలన్న ఆసక్తి ఉండేది. అయితే వారి మాదిరిగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అని భావించాడు. అనుకున్నదే తడవుగా ఒక రోజు శివ గానం చేస్తూ అనేక రకాల పూలను చెట్ల నుంచి సేకరించాడు. వాటిని తీసుకుని వెళ్లి శివ భక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి .. ‘‘స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామి కి పూజ చేసి మెప్పించలేను. నాకు అంత చదువు లేదు శివ నామ స్మరణ తప్ప ఇంక ఏమీ తెలియదు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతి రోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను’’ అని వేడుకున్నాడు. తర్వాతేం జరిగిందో తదుపరి కథనంలో తెలుసుకుందాం.
