
చైతన్యుడు ఎంత పూజించినా శివుడి అనుగ్రహం లభించలేదు. దీంతో తిరిగి గురువుకి మొరపెట్టుకున్నాడు. దీంతో చైతన్యుడికి జ్ఞానోదయానికి సమయం ఆసన్నమైందని తలచి గురువు ఇలా అన్నాడు. ఈ యుగానికి కాళీ మాత మూర్తి అన్నిటి కన్నా శ్రేష్టమైనది కావున.. పూజించమని చెప్పి కాళీ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. చైతన్యుడు సంతోషం గృహోన్ముఖుడయ్యాడు. శివ మూర్తిని కూడా మునుపటి విష్ణు మూర్తి పక్కన అటక ఎక్కించేశాడుజ. కాళీ మాత మూర్తిని ఆరాధించటం మొదలెట్టాడు. కాళీ మాత మూర్తి ముందర ధూపాన్ని వెలిగించి పూజించడం మొదలు పెట్టాడు. ఆ ధూపం గది మొత్తం నిండిపోతూ ఉంది.
ధూపం.. అటక మీద ఉన్న శివుడి మూర్తిని సమీపించగానే చైతన్యుడు కోపంతో వెళ్ళి తనను అనుగ్రహించని ఈ మూర్తి (విగ్రహం) కాళీ మాత మూర్తికి అర్పించిన ధూపాన్ని పీల్చకూడదు అని ఆ మూర్తి నాసిక రంధ్రాల్లో పత్తిని పెట్టబోయాడు. అంతలో ఆ విగ్రహం మాయం అయ్యి కళ్ల ఎదుట పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు చిద్విలాసం చేస్తూ దయతో కోరిక కోరుకో అన్నాడు. ఈ హటత్పరిమాణానికి సంభ్రమాశ్చర్యాల్లో మునిగి పోయిన చైతన్యుడు పరమేశ్వరుడిని ఇలా అడిగాడు. స్వామి ఇన్ని రోజుల నా జప, పూజలకి స్పందించని వాడి వి నీ మూర్తి (విగ్రహం) నన్ను అనుగ్రహించటం కోసం కాదు అని తలచి నిన్ను పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను అనుగ్రహించటానికి కారణం ఏమి అని అడిగాడు?
పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు. కుమారా.. చైతన్య నువ్వు ఇన్ని రోజులు పూజించిన ఆ మూర్తిలో నేను ప్రాణంతో ఉన్నాను అన్న భావంతో పూజించలేదు. ఇన్ని రోజులు కేవలం ఒక రాతి విగ్రహంగానే భావించావు. కానీ ఈ రోజు నా మూర్తికి ప్రాణం ఉంది అన్న భావనతో నేను ధూపాన్ని పీలుస్తాను అని నా మూర్తిలో ప్రాణంతో కూడిన నేను ఉన్నాను అని తలచావు కావున నీకు అనుగ్రహం లభించిందని చెప్పాడు. వేదం కూడా ఇదే చెప్తోంది కేవలం ప్రకృతిని , విగ్రహాలని పూజిస్తే లాభం లేదు అని. దాని అర్థం తెలుసుకోలేని మూర్ఖులు వేదాలలో విగ్రహారాధన లేదు అని వితండవాదం చేస్తుంటారు. మనం ఎప్పుడైతే విగ్రహంలో పరమాత్మని చూడగలుగుతామో అప్పుడే మనకి ఫలితం ఉంటుందని చెప్పాడు. ఈ కథ ద్వారా తెలిసేదేంటంటే.. విగ్రహంలోనూ ప్రాణం ఉంటుంది. విగ్రహంలోనూ భగవంతుడిని చూడాలి.
