Site icon Bhakthi TV

శివుడిని నిస్వార్థంగా పూజించిన గొల్లవానికి శివుడు ఏం చేశాడు?

శివ భక్తుడిని చూసిన గొల్లవానికి సైతం శివయ్యను పూజించుకోవాలన్న ఆశ కలిగింది. ఆ విషయాన్నే శివ భక్తుడికి చెప్పి అనుమతి కోరాడు. దీనికి మహా భక్తుడు సైతం అంగీకరించాడు. దీనికి కారణం లేకపోలేదు. అతన్ని గమనించిన శివ భక్తునికి ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం కనిపించలేదు. చదువు లేకున్నా మాటలో సంస్కారం ఉంది. పేదవాడు అయినా కూడా శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివ నామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడుజ ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషంగా అంగీకరించాడు.

శివుడే వరం ఇచ్చినట్టుగా పొంగిపోయిన గొల్లవాడు.. ప్రతి రోజు శివ నామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇవ్వడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుంచి చూసి శివ నామ స్మరణ చేస్తూ పొంగిపోయే వాడు. ఆ తరువాత కొంత కాలానికి ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది. శివ భక్తుడి కోసం శివ గణాలు వచ్చారు. ఆ గొల్లవాని కోసం శివుడు పూల పల్లకిని పంపించాడు. అది గమనించిన శివభక్తునికి గొల్లవాని కోసం పల్లకి ఎందుకొచ్చిందని అడిగాడు. అతను నిత్యం శివనామ స్మరణ చేస్తూ శివ పూజ కోసం పూలు తెచ్చి భక్తిగా సమర్పించేవాడు. అతను తెచ్చిన పూలు శివుని పాదాల చెంతకు చేరేవి. అందుకే శివయ్య పూల పల్లకి పంపాడని శిగణాలు చెప్పారు. శివ గణాలతో వెళ్లిన శివ భక్తుని కన్నా ముందే పుష్ప పల్లకీలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు.

Share this post with your friends
Exit mobile version