Site icon Bhakthi TV

సీత స్మారక భవనం విశేషాలేంటంటే..

భూదేవిలో సీతమ్మ ఐక్యమైన ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, అలహాబాద్‌లను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కి.మీ. దూరంలో దక్షిణాన ఉంటుందని తెలుసుకున్నాం కదా. సీత స్మారకం భవనం విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని రెండు అంతస్థుల్లో నిర్మించారు. పై అంతస్తులో అద్దాల మంటపం ఉంటుంది. ఈ అద్దాల మంటపంలో సీతమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. భవనం కింద భాగంలో అసలైన దృశ్యం ఉంటుంది. దీనిలో సీతాదేవి భూదేవి లోపలి చేరుకున్తున్నట్లుగా చూపించే సీతాదేవి ప్రతిమ కనిపిస్తుంది.

ఈ విగ్రహం చూపరులను అమితంగా ఆకట్టుకుంది. జీవ కళ ఉట్టిపడుతూ మనసుని కదిలిస్తుంది. భవనం గోడల మీద భూదేవిలో కలిసి పోతున్న సీతాదేవికి సంబంధించిన ప్రతి సంఘటనలు తెలియజేసే విధంగా అనేక చిత్రాలు, శిల్పాలు కనిపిస్తాయి. ఈ స్మారక భవనాన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు నిర్మించారు. స్వామి జితేంద్రానంద సన్యాసం స్వీకరించిన ఋశికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతూ ఉండేవాడట. అప్పుడు సీతాదేవి అనుగ్రహంతో కాలినడక 900 కిలోమీటర్ల ప్రయాణించి అలహాబాద్‌లో సీతమ్మ భూదేవిలో ఐక్యమైన ప్రాంతానికి చేరుకున్నాడట. అనంతరం దాతల నుంచి విరాళాలు సేకరించి ఈ స్మారక భవనాన్ని నిర్మించారట.

Share this post with your friends
Exit mobile version