Site icon Bhakthi TV

ఫాల్గుణ మాసం ప్రత్యేకతలేంటి?

ఫాల్గుణమాసంలో మనకు ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఫల్గుణ వ్రతాన్ని ఆచరించాకే అదితికి వామనుడు జన్మించాడని.. ఫాల్గుణం అర్జనుడి జన్మ నక్షత్రమని తెలుసుకున్నాం. ఇంకా ఈ మాస ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. శ్రీరాముడు లంకకు బయల్దేరినదీ, లక్ష్మీదేవి పాలకడలి నుంచి ఉద్భవించినదీ, ధర్మరాజు జన్మించిందీ ఈ నెలలోనే కావడం విశేషం. ఈ మాసంలో వచ్చే ప్రత్యేక తిథులేంటంటే.. నృసింహ స్వామిని పూజించే నృసింహ ద్వాదశి, లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి, హోళీ పండుగ, అమలక ఏకాదశి, పాప విమోచన ఏకాదశి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో వస్తాయి.

ప్రత్యేక తిథులు మాత్రమే కాకుండా.. తీర్థాలు కూడా రానున్నాయి. ఫాల్గుణ మాసంలోనే కోరుకొండ తీర్థం, కుమారధార తీర్ధ ముక్కోటి వంటి తీర్ధాలు కూడా జరుగుతాయి. అలాగే ఈ మాసం దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గోదానం, వస్త్రదానం, అన్నదానం వంటి దానాలు చేయడం వలన గోవిందునికి ప్రీతి కలుగుతుందట. దీంతో పాటు ఈ మాసంలో వచ్చే ఫాల్గుణ ఏకాదశి నాడు ఉసిరిక చెట్టును పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటారు. అలాగే ఈ మాసంలోనే శ్రీమహాలక్ష్మి క్షీర సాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ రోజున శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ధనధాన్యాలు లోటుండదట అలాగే ఈ మాసంలో వచ్చే హోలీ పండుగ నాడు మన్మథుడు, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడిని పూజిస్తారు.

Share this post with your friends
Exit mobile version