Site icon Bhakthi TV

బడే హనుమంతుడి దేవాలయ విశేషాలేంటంటే..

ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్ దేవాలయం గురించి ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలో హనుమంతుని విగ్రహం 20 అడుగులు ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉంటుంది కాబట్టి ఇక్కడ సంగమ స్నానం చేసిన వారికి పూర్తి పుణ్యం దక్కాలంటే తప్పనిసరిగా బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించాలట. అందుకే సంగమ స్నానం ఆచరించిన భక్తులు తప్పనిసరిగా బడే హనుమంతుడిని దర్శించుకుంటారు.

ఈ దేవాలయం మరో ఆకర్షణ గంగా నది. ఇక్కడి హనుమంతుని విగ్రహం ఒక వైపు గంగా నీటిలో మునిగి ఉంటుంది. అయితే అన్ని సమయాల్లో కాదులెండి.. వర్షాకాలంలో గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో నీరు విగ్రహం పాదాలను తాకుతుందట. ఆ సమయంలో ఆంజనేయుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తుంటారు. అదొక పవిత్ర దృశ్యంగా అభివర్ణిస్తూ ఉంటారు. గంగా నది ఈ దేవాలయంలోకి ప్రవేశించడం ఇక్కడి వారంతా శుభసూచకంగా భావిస్తారు. ఇక ఈ దేవాలయం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు తెరిచి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version