
శివ పూజలో చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకున్నాం కదా. శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. అలాగే కొబ్బరి నీళ్లతో అభిషేకం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని తెలుసుకున్నాం. ఇక శివాలయంలో చేసే ప్రదక్షిణల విషయంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. అన్ని ఆలయాల్లో మాదిరిగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలని చెబుతారు. శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు.
ముందుగా మనం ప్రదక్షిణను శివాలయంలో ఉండే ధ్వజ స్తంభం దగ్గర నుంచి ప్రారంభించాలి. ఎడమ పక్కగా గర్భాలయం వెనక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరగాలి. కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు. మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మాత్రమే ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ప్రదక్షిణ చేసే వాళ్లు ఈ నియమాన్ని తప్పనిసరిగా మైండ్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక స్వామివారికి ఆవు పాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. కాబట్టి శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకం చేస్తే ఫలితం అత్యంత బాగుంటుంది.
