Site icon Bhakthi TV

అత్యంత ధనిక ఆలయాల వరుసలో ఏమేం ఉన్నాయంటే..

అత్యంత ధనిక దేవాలయాల్లో తొలి స్థానంలో కేరళలోని త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఇక రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఈ ఆలయంలో బంగారమే ఏకంగా 9 టన్నుల నిల్వ ఉంది. ప్రతి ఏటా ఆలయానికి భక్తుల నుంచి దాదాపు రూ. 650 కోట్ల విలువైన విరాళాలు కానుకల రూపంలో అందుతాయి. ఇక ఆలయంలో ప్రసాదాల విక్రయం, దర్శన టికెట్ల అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి సంబంధించి వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.14000 కోట్లకు పైగా నగదు డిపాజిట్ ఉంది.

ఇక దేశంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ.6 కోట్లు ఉంటుందని చెబుతారు. ఈ ఆలయాన్ని నిత్యం దాదాపు 30 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. దీని తర్వాత స్థానంలో షిర్డీ సాయి ఆలయం ఉంది. ఈ ఆలయం బ్యాంకు ఖాతాలో 380 కిలోల బంగారం, 4428 కిలోల వెండితో పాటు రూ.1800 కోట్లు ఉన్నాయి. ముంబైలోని సిద్ధివినాయకుడికి ఏటా దాదాపు రూ.125 కోట్లు ఆదాయం లభిస్తుంది. మరి ఇంతటి ఆదాయాన్ని ప్రభుత్వ పరం చేశారనుకోండి.. మన దేశం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటుందని అంచనా.

Share this post with your friends
Exit mobile version