Site icon Bhakthi TV

అయ్యప్పస్వామి 18 మెట్ల పేర్లేంటి? అధిదేవతలెవరు?

అయ్యప్పస్వామిని చేరుకునే 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. దాని కథేంటో కూడా తెలుసుకున్నాం. స్వామివారు ఒక్కో మెట్టు ఎక్కిన మీదట.. తన అస్త్ర శక్తినంతా మెట్లలో నిక్షిప్తం చేశాడని చెబుతారు. మండలం రోజులు దీక్ష పూర్తి చేసి ఇరుముడితో అయ్యప్ప స్వామి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి సన్నిధానానికి చేరుకుంటారు. అయితే ఈ పద్దెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుపై ఒక్కో అధిష్టాన దేవత కొలువుదీరి ఉంటుందట. పద్దెనిమిది మెట్లకు అధిదేవతలుగా ఎవరుంటారో తెలుసుకుందాం.

మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, భేతాళ, నాగరాజ, కర్ణ, వైశాఖ, పుళిందిని, రేణుకా పరమేశ్వరి, స్వప్న వారాహి, ప్రత్యంగిర, నాగయక్షిణి, మహిషాసురమర్ధిని, అన్నపూర్ణేశ్వరి అనే శక్తులే అయ్యప్పస్వామి పదునెట్టాంబడికి అధిదేవతలుగా ఉంటారు. ఈ 18 మెట్లలో ప్రతి దానికీ ఓ పేరు ఉంటుంది.

అవేంటంటే.. అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ, ఈశత్వ, ఇఛ్ఛ, బుద్ధి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియంకర, సర్వ మంగళకర, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్య దాయక.

Share this post with your friends
Exit mobile version