Site icon Bhakthi TV

శివ పూజలో చేయకూడని పొరపాట్లు ఏంటి?

శివయ్యను హిందువులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శివుడికి భక్తితో ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలు.. సంతోషభరితుడై కోరిన కోరికలు తీరుస్తాడట. అందుకే శివయ్యను భోళా శంకరుడని పిలుస్తారు. అయితే శివ పూజను ఎలా పడితే అలా చేయకూడదని అంటారు. శివయ్య పూజ సమయంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదని అంటారు. పొరపాటున చేసే తప్పుల కారణంగా శని దోషం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి శివపూజ సమయంలో చేయకూడని పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది భస్మం.. దీనినే విభూదిగా భక్తులు భావించి నుదుటున ధరిస్తారు. విభూదిని మొహాన ధరిస్తే పాపాలు న‌శిస్తాయని నమ్మకం. అయితే శివ పూజలో ఉపయోగించే భస్మాన్ని శివయ్య కుంకుమ పూజలో మాత్రం వినియోగించకూడదు. అలాగే శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. లింగాన్ని విభూది, గంధంతో మాత్రమే అలంకరించాలి. శివయ్య అభిషేకంలో జలం, చెరకు రసం, ద్రాక్ష రసం, పంచామృతం వినియోగిస్తే మంచి జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బిరి నీళ్ళను మాత్రం శివలింగానికి అర్పించరాదు.

Share this post with your friends
Exit mobile version