Site icon Bhakthi TV

హరిద్వార్‌లోని ప్రధాన స్థలాలు ఏమేం ఉన్నాయంటే..

హిందువులకు మోక్ష ద్వారంగా పేరుగాంచిన హరిద్వార్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది మహా కుంభమేళా జరిగే నాలుగు ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. హరిద్వార్‌లోని ప్రధాన స్థలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన స్థలాలు..

హర్‌కి పౌరి: గంగాజలంలో స్నానం చేయడానికి అత్యంత పవిత్రమైన ఘాట్. సాయంత్రం జరిగే గంగాఆరతి మనసును మంత్రముగ్ధులను చేస్తుంది.
మంసా దేవి ఆలయం
చండీ దేవి ఆలయం
మాయా దేవి ఆలయం
భీమగోడా కుండం
భరత్ మాత మందిరం

హరిద్వార్‌లో గంగాస్నానం, దానధర్మాలు, గంగా ఆరతి దర్శనం చేసిన వారికి పాప విమోచనం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ గంగానది పవిత్ర జలాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజలలో ఉపయోగించడం ప్రత్యేకంగా జరుగుతుంది. హరిద్వార్ యాత్ర ద్వారా శ్రీమన్నారాయణుని కృపతో జీవితానికి శాంతి, మోక్షం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. హరిద్వార్‌కి వెళ్లాలనుకునేవారు.. విమానం ద్వారా అయితే ఢిల్లీ/డెహ్రాడూన్ వెళ్లాల్సి ఉంటుంది. రైలు ద్వారా అయితే హరిద్వార్ జంక్షన్ ఉంది. ముఖ్యంగా హరిద్వార్‌ను సందర్శించుకునేందుకు శీతాకాలం సరైన సమయం.

Share this post with your friends
Exit mobile version