Site icon Bhakthi TV

కకాన్‌మఠ్ ఆలయానికి సంబంధించి అంతు చిక్కని రహస్యాలేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న కకాన్‌మఠ్ దేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతున్నాయట. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయట. దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ఆలయ రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది ఆర్కియాలజిస్టులు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నమంతా విఫలయత్నంగానే మిగిలిపోయింది.

స్టడీ చేయడానికి వచ్చిన ఆర్కియాలజిస్టులు గుడి చుట్టు పక్కల మాత్రమే పరిశోధన చేశారు కానీ ఎందుకో గుడిని మాత్రం టచ్ చేయలేకపోయారు. ఇప్పటికీ ఆ ఆలయాన్ని కట్టగా మిగిలిన రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయి మనకు దర్శనమిస్తాయి. అవన్నీ ఆలయ నిర్మాణం కోసం వాడినవేనని.. నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు వదిలి వేయడంతో అవలా పడిపోయాయని చెబుతారు. ఈ ఆలయంలో కిందున్న ఏ రాయిని కదిలించినా గుడి మొత్తం కదులుతున్నట్టుగా శబ్దం వస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువు ఉంటుందని చెబుతారు. ఇవన్నీ పుకార్లేనని కొట్టి పడేస్తారు. కానీ నిజాన్ని నిరూపించేందుకు ఇప్పటి వరకూ ఎవరూ సాహసించింది లేదు. దీంతో ఈ ఆలయం నేటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. ఎలాంటి బైండింగ్ లేకుండా రాళ్లు ఎలా నేటికీ నిలిచాయనేది అతి పెద్ద మిస్టరీ.

Share this post with your friends
Exit mobile version