Site icon Bhakthi TV

పంచ ప్రయాగలు అంటే ఏమిటి? ఏ ప్రయాగంలో ఎవరు తపస్సు చేశారు?

పంచ ప్రయాగల గురించి హిందువులంతా వింటూనే ఉంటారు కానీ వాటి గురించి పూర్తి సమాచారం చాలా మందికి తెలియదు. అసలు పంచ ప్రయాగని వేటిని అంటారు. ఎందుకు వాటిని పంచ ప్రయాగలని అంటారోత తెలుసుకుందాం.

విష్ణు ప్రయాగం: అలకానందా + ధౌలిగంగాను విష్ణు ప్రయాగగా పేర్కొంటారు. పండితుల ప్రకారం శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు.

నంద ప్రయాగం: అలకానందా + నందాకినిలను నంద ప్రయాగం అంటారు. ఇక్కడ యయాతి రాజు యజ్ఞం చేశాడట. ఇక్కడ యయాతి మహారాజు యజ్ఞం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

కర్ణ ప్రయాగం: అలకానందా + పిండర్ నది. మహాభారతంలో కర్ణుడు ఇక్కడ సూర్యుడి గురించి తపస్సు చేసి అతిలోక బలాలను పొందాడని విశ్వాసం

రుద్రప్రయాగం: అలకానందా + మందాకినిలను కలిపి రుద్ర ప్రయాగగా పేర్కొంటారు. ఇది శివుడు రుద్ర తాండవం చేసిన స్థలం. నృత్యశాస్త్రం పుట్టిన ప్రదేశంగా దీనిని కొందరు భావిస్తారు

దేవప్రయాగం: అలకానందా + భగీరథి. ఇక్కడే గంగా నది రూపంగా కలుసుకుంటుంది – దీనినే నిజమైన గంగోత్రి సంగమంగా పరిగణిస్తారు.

Share this post with your friends
Exit mobile version