Site icon Bhakthi TV

చంద్రుని కాంతిలో ఉండే 16 కళలు ఏంటి?

శరత్ పూర్ణిమ రోజున చంద్రునిలో 16 కళలు ఉంటాయని విశ్వాసం. అందుకే ఇవాళ పాయసాన్ని తయారు చేసి చంద్రకాంతిలో ఉంచుతారు. చంద్రుని కిరణాలు పాయసంపై పడేలా చూస్తారు. అప్పుడు పాయసానికి అమృతత్వం వస్తుందని నమ్మకం. మరి చంద్రకాంతిలో ఉండే 16 కళలు ఏంటో తెలుసుకుందాం. అమృతం, ఆలోచనలు, అందం, ఆరోగ్యం, కోరికల నెరవేర్పు, జ్ఞానం, ప్రకాశం, శాంతి, కీర్తి, కాంతి, సంపద, ప్రేమ, శాశ్వతం, సంపూర్ణత అంటే కార్యాచరణ, పూర్ణామృతం అంటే ఆనందం ఈ కళలు పాలకు లేదా పాల పదార్ధాలకు చేరుకుంటాయని విశ్వాసం.

అనంతరం మరుసటి రోజు ఉదయం అంటే రేపు శ్రీ మహా విష్ణువుకు ఆ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తారు. ఈ పాయసాన్ని స్వీకరిస్తే ఆయుష్షు, ఆరోగ్యంతో పాటు ఇంట్లో ఎలాంటి ఆర్థిక కష్టాలున్నా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని నమ్మకం. ఇవాళ లక్ష్మీదేవి భూమి పైకి వస్తుందని నమ్మకం కాబట్టి ఇవాళ లక్ష్మీదేవిని పూజించుకుంటారు. పూర్ణ క్రతువులతో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version